ఆ విష‌యంలో టీఆర్ఎస్‌, బీజేపీపై కాంగ్రెస్ విమ‌ర్శ‌లు.. సందిగ్ధంలో ప‌డ్డ కారు, క‌మ‌లం పార్టీలు

-

గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా మొన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఏక‌ధాటిగా వారం రోజుల‌కు పైగా అక్క‌డే మ‌కాం పెట్టారు. ఏదో టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యానికి కు శంకుస్థాప‌న కోసం అని వెల్లిన కేసీఆర్ త‌న ప్లాన్ ఛేంజ్ చేసి భార‌తీయ జ‌న‌త‌పార్టీ కేంద్ర పెద్ద‌ల‌ను వ‌రుస‌గా క‌లుసుకున్నారు. దీంతో ఒక్క‌సారిగా రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు వెలువ‌డ్డాయి. బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య ఇంట‌ర్న‌ల్ పొత్తు జ‌రిగింద‌ని, వారి మ‌ధ్య ఏదో ఒప్పందం కుదిరినట్టు ర‌కాల ర‌కాల వార్తలు వ‌చ్చాయి. దీంతో తెలంగాణ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా హీటెక్కాయి.

దీంతో ఈ విష‌యంపై కాంగ్రేస్ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టింద‌ని చెప్పాలి. టీఆర్ఎస్‌, బీజేపీ లు రెండూ ఒక‌టేన‌ని, అవి ఇక్క‌డ గల్లీలో కుస్తి ప‌ట్టి చివ‌ర‌కు ఢిల్లీలో దోస్తీ చేస్తున్నాయంటూ విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఈ భేటీపై మాత్రం అటు టీఆర్ ఎస్‌, ఇటు బీజేపీ పెద్ద‌గా స్పందించ‌లేదు. మ‌రీ ముఖ్యంగా బీజేపీ పార్టీకి ఇక్క‌డ పెద్ద షాక్ త‌గిలిన‌ట్ట‌యింది. ఇప్ప‌టికే బండి సంజ‌య్ నేతృత్వంలో రాబోయే 2023 సాధారణ ఎన్నికల్లో గెలిచే విధంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్ప‌టికే విమోచ‌న దిన స‌భ, పాద‌యాత్ర‌లు లాంటివి కూడా ప్లాన్ చేస్తోంది.

ఇలాంటి త‌రుణంలో కేంద్ర నాయకత్వాన్ని కూడా తెలంగాణ‌కు ర‌ప్పించి పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయాల‌ని చూస్తోంది. కానీ అనూహ్యంగా కేసీఆర్ ఢిల్లీ టూర్ చేయ‌డంతో అంతా ఉల్టా అయిపోయింది. రాష్ట్రంలో బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నస‌మ‌యంలోనే సీఎం కేసిఆర్ మాస్ట‌ర్ ప్లాన్ వేసి ఢిల్లీ పెద్ద‌ల‌ను క‌ల‌వ‌డంతో బీజేపీ, టీఆర్ఎస్ క‌లిసిపోతున్నాయంటూ విమ‌ర్శ‌లు రావ‌డం బీజేపీకి పెద్ద స‌మ‌స్యే అని చెప్పాలి ఇక‌పోతే దీన్ని మాత్రం కాంగ్రెస్ బాగానే వినియోగించుకుంటోంది. కానీ అధికార టీఆర్ఎస్ మాత్రం దీనిపై పెద్ద‌గా స్పందించ‌ట్లేదు. క‌నీసం కేసీఆర్ ఎందుకు క‌లిశారో కూడా వివ‌రించే ప్ర‌య‌త్నం చేయ‌ట్లేదు. దీంతో ఏదో జ‌రుగుతోంద‌ని చ‌ర్చ‌లు సాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news