కాసుల వర్షం కురిపిస్తోన్న బింబిసార-సీతారామం..చరిత్రలోనే తొలిసారిగా !

-

ఇటీవల రిలీజ్‌ అయిన బింబిసార, సీతారామం చిత్రాలు బాక్సాఫీస్ ను బద్దలు కొడుతున్నాయి. ఈ రెండు చిత్రాలు రెండో వారంలోను అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా బింబిసార మూవీ కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే నిర్మాత‌తో పాటు ఎగ్జిబిట‌ర్లు లాభాల బాట‌ప‌ట్టారు. ప‌ది రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు 49 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

దాంతో బింబిసార 50 కోట్ల క్లబ్‌లో చేరిపోయిందనే చెప్పొచ్చు. హిస్టారికల్ ఫాంటసీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహించారు. సంయుక్తమీనన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. ఇకపోతే క్లాసిక్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సీతా రామం మూవీ.. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్టు ట్విటర్‌లో ఓ వీడియో ద్వారా అనౌన్స్‌ చేశారు మేకర్స్.

Read more RELATED
Recommended to you

Latest news