స్వయం పేరుతో అమ్మాయిలు అబ్బాయిలను ఎంపిక చేసుకోవడం ఒక పద్దతి.. ఇప్పడు ఇదంతా ఎక్కడ ఉందిలే కానీ.. ఈరోజుల్లో పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లు అంటే ఆన్లైన్ సైట్ల ద్వారానే మ్యారేజ్ బ్రోకర్ ద్వారానో జరుగుతుంది. కానీ మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు తెచ్చుకున్నట్లు ఆ బజార్‌కు వెళ్లి పెళ్లికొడుకును తెచ్చుకోవచ్చట. భలే ఉంది కదా..! జాబ్ మేళాలా అది పెళ్లికొడుకుల మేళా అన్నట్లు..ఇదంతా ఎక్కడో కాదు.. మన ఇండియాలోనే జరుగుతుందట.. బీహార్‌లో జరిగే ఈ వింత ఆచారం గురించి ఇంకొంత సమాచారం మీ కోసం.!
బీహార్‌లోని మధుబని జిల్లాలో అమ్మాయిలే స్వయంగా మార్కెట్‌కు వెళ్లి తమకు నచ్చిన భర్తను ఎంపిక చేసుకుంటారు. ఈ మార్కెట్ ప్రతి రోజు ఉండదు. ప్రత్యేకమైన రోజుల్లోనే ఉంటుందట. సౌరత్ మేళా లేదా సభాగచ్చి పేరుతో ఈ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తారు. 9 రోజుల వరకు జరిగే ఈ మేళలో వేలాది మంది పెళ్లికాని అబ్బాయిలు వస్తారు. రావి చెట్టుకింద నిలుచుని తమను ఎవరు కొనుగోలు చేస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారట పాపం.
అయితే, ఈ సాంప్రదాయం ఇప్పటిది కాదు. సుమారు 700 సంత్సరాల నుంచి జరుగుతూనే ఉందట. కర్నాట్ రాజవంశానికి చెందిన రాజా హరి సింగ్ ఏడు శతాబ్దాల క్రితం ఈ మేళాను ప్రారంభించినట్లు సమాచారం. ప్రతి వరుడికి వారి విద్యార్హతలు, కుటుంబ నేపథ్యం ఆధారంగా ధరను నిర్ణయిస్తారు. మైథిలీ వర్గానికి చెందిన మహిళలు ఎక్కువగా ఈ మేళాలో పాల్గొని భర్తను కొనుగోలు చేస్తారు.
ఆఫర్లు కూడా..!
వస్తువుల షాపింగ్ తరహాలోనే అక్కడ కూడా ఆఫర్స్ ఉంటాయి. కొంతమంది మహిళలు అక్కడి అబ్బాయిల బర్త్, స్కూల్ సర్టిఫికెట్లు కూడా పరిశీలిస్తారు. దీంతో ఆ మార్కెట్‌కు వెళ్లే అబ్బాయిలు తప్పకుండా అన్ని ఆధారాలు దగ్గర ఉంచుకోవాలి. అమ్మాయికి అబ్బాయి నచ్చిన తర్వాత ఇరువురి కుటుంబ సభ్యులు చర్చించుకుని పెళ్లి ఖాయం చేస్తారట..
ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా…
ఈ మార్కెట్లో ఎక్కువగా ఇంజినీర్లు, వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులకు డిమాండ్ ఎక్కువగా ఉంటోందట. అలాగే తక్కువ వయస్సు ఉన్న యువకులు త్వరగా అమ్ముడవుతారు… వరుడిని కొనుగోలు చేయడమంటే.. వరకట్నం ఇస్తున్నట్లే లెక్క. కానీ, కట్నాలు లేకుండా ఉండేందుకే ఈ మార్కెట్‌ను ప్రారంభించారు.
పేరుకు మాత్రమే ఇది వరుడి మార్కెట్. అమ్మాయిలకు అబ్బాయిలను ఎంపిక చేసుకొనే విషయంలో వారి కుటుంబ సభ్యుల పెత్తనమే ఎక్కువగా ఉంటుందట. బాగా సెటిలైన్ అబ్బాయిలను చూసుకుని బేరాలడి మరీ పెళ్లి సెటిల్ చేసేసుకుంటారట.. ఈ మార్కెట్ గురించి ఇటీవల బాగా ప్రచారం జరిగడంతో చాలామంది కుర్రాళ్లు వందలాది కిలోమీటర్లు ప్రయాణించి మేళాలో తమ లక్ పరీక్షించుకోడానికి వస్తున్నారు. కొందరు మాత్రం అక్కడ అమ్మాయిలు ఎలా ఉంటారో చూద్దామని సరదాగా వెళ్తున్నారట..
మాములుగానే అరేంజ్ మ్యారెజ్ అనేది ఒక బిజినెస్ డీల్ అని చాలామంది అంటారు.. ఈ సంప్రదాయం నిజమే అన్నట్లు ఉంది. లైఫ్‌కు సంబంధించిన విషయాల్లో ఇలా ఎంపిక చేసుకోవడం ఎంత వరకూ కరెక్ట్ అంటారు..?