Big Boss OTT Telugu: ట్రోఫితో పాటు సినిమా అవకాశం..బిందు మాధవికి కలిసొచ్చిన తెలుగు బిగ్ బాస్

-

తెలుగమ్మాయి బిందు మాధవి..తొలుత తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఓటీటీ గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి హెజిటేట్ చేసింది. కానీ, ఇప్పుడు టైటిల్ విన్ అవడంతో పాటు తెలుగు సినిమాలో అప్పుడే అవకాశం కూడా పొందింది. తమిళ్ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసి అక్కడ మంచి పేరు సంపాదించుకుంది బిందు మాధవి.

ఈ క్రమంలోనే బిందు మాధవికి తమిళ్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అలా బిందు మాధవి తెలుగు సినిమాలకు దూరమయింది. కాగా, బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయడం ద్వారా టైటిల్ ట్రోఫి గెలుచుకుని మళ్లీ ఇప్పుడు తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టబోతున్నదని చెప్పొచ్చు.

బిందు మాధవిని నటిగా తెలుగు వెండితెరపైన కూడా చూడొచ్చు. ‘‘F3’’ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పటికే బిందు మాధవికి హామీ ఇచ్చేశాడు. తాను నందమూరి బాలయ్యతో చేయబోయే నెక్స్ట్ ఫిల్మ్ లో తప్పకుండా ఓ పాత్రను రెడీ చేస్తానని తెలిపాడు. అలా బిందు మాధవికి అప్పుడే ఆఫర్ వచ్చేసిందని చెప్పొచ్చు.

ఇక బిగ్ బాస్ సీజన్ సిక్స్ నాన్ స్టాప్ OTT విజేత గా నిలిచిన బిందు మాధవి.. ట్రోఫితో పాటు రూ.40 లక్షలు సొంతం చేసుకుంది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ షో.. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేక సెట్ లో కొనసాగింది.. 84 రోజుల పాటు సీజన్ సిక్స్ నడిచింది.

 

Read more RELATED
Recommended to you

Latest news