స్విట్జర్లాండ్ లోని దావోస్ లో నేటి నుండి 26వ తేదీ వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యుఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం సాయంత్రం దావోస్ చేరుకున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు వేదికగా నేడు డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాజ్ ష్వాప్ తో ఒప్పందం కుదుర్చుకుంది. డబ్ల్యూఈఎఫ్ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడనుంది.
నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన మానవవనరుల తయారీ,స్థిరంగా ఉత్పత్తులు, రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలు, డేటా షేరింగ్, ఉత్పత్తులకు విలువ జోడించడం లాంటి 6 అంశాల్లో ఈ ఒప్పందం ద్వారా వరల్డ్ ఎకనామిక్ ఫోరం రాష్ట్రానికి మార్గనిర్దేశం చేస్తోంది. డబ్ల్యూఈఎఫ్ హెల్త్ కేర్- హెల్త్ విభాగం అధిపతి డాక్టర్ శ్యామ్ బిపేన్ తో కూడా సీఎం సమావేశం అవుతారు. దీని తర్వాత మధ్యాహ్నం బీసీజీ గ్లోబల్ చైర్మన్ హన్స్ పాల్ బర్కానర్ తో ముఖ్యమంత్రి ఏపీ లాంజ్ లో సమావేశం కానున్నారు. సాయంత్రం డబ్ల్యూఈఎఫ్ కాంగ్రెస్ వేదిక లో జరిగే వెల్కమ్ రిసెప్షన్ కి సీఎం హాజరవుతారు.