కమల్ హాసన్ గౌతం మీనన్ కాంబినేషన్ లో భారీ సక్సస్ కి సీక్వెల్ …!

-

సౌత్ సినిమా ఇండస్ట్రీలో గౌతం వాసుదేవ్ మీనన్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే. మొదటి సినిమా చెలి తోనే సంచలన విజయాన్ని అందుకొని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. ఆ తర్వాత సూర్య తో కాక్క..కాక్క మరో పెద్ద సంచలన విజయాన్ని అందుకుంది. అదే సినిమాని తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా ఘర్షణ పేరుతో తెరకెక్కించి సూపర్ హిట్ ఇచ్చాడు.

 

ఇలా బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలతో తమిళ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న గౌతం మీనన్ ఆ తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్ తో వెట్టైయాడు విల్లైయాడు రూపొందించి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చాడు. ఈ సినిమా “రాఘవన్” పేరుతో తెలుగులోనూ డబ్బింగ్ అయి మంచి హిట్ ని సాధించింది.

అయితే గౌతం మీనన్ కి తను తెరకెక్కించిన కొన్ని బ్లాక్ బస్టర్స్ కి సీక్వెల్స్ రూపొందించాలని సన్నాహాలు చేస్తున్నారు. అందులో “రాఘవన్”, ఘర్షణ, అక్కినేని నాగ చైతన్య సమంత జంటగా వచ్చి సంచలన విజయాన్ని అందుకున్న ఏ మాయ చేశావే సినిమాలున్నాయట. అందులో భాగంగా ఇప్పుడు “రాఘవన్” సినిమాకు సీక్వెల్ చేయనున్నారని తాజా సమాచారం. యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ బ్యాగ్డ్రాప్ లో ర్రుపొందిన “రాఘవన్” కి గౌతమ్ మీనన్ సీక్వెల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారట. ఇక కమల్ హాసన్ ఈ స్క్రిప్ట్ ఓకే చేస్తే ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version