చిరు ‘విశ్వంభర’లో బాలీవుడ్‌ హీరో

-

వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘విశ్వంభర’. ఈ చిత్రంలో ఓ పవర్‌ఫుల్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు  కనిపించనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. బాలీవుడ్‌ స్టార్‌ కునాల్‌ కపూర్‌ ‘విశ్వంభర’ టీమ్‌లో జాయిన్‌ అయినట్లు తెలుపుతూ దర్శకుడు పోస్ట్‌ పెట్టారు. ఇందులో కునాల్‌ విలన్‌గా కనిపించనున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘విశ్వంభర’ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో కునాల్‌ కూడా పాల్గొంటున్నారు.

ఈ సినిమాలో విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో పోస్ట్‌ ప్రొడక్షన్‌పై చిత్రబృందం ప్రత్యేక దృష్టి పెట్టనుంది. రూ.200కోట్లతో సోషియో ఫాంటసీ ఫిల్మ్‌గా ‘విశ్వంభర’ రూపొందుతోంది. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉండనున్నట్లు ఎప్పటి నుంచో టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో స్టార్‌ హీరోయిన్స్‌ త్రిష, ఆషికా అధికారికంగా జాయిన్‌ అయ్యారు. వీరితో పాటు సురభి, ఇషా చావ్లా, మీనాక్షి చౌదరి పేర్లను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news