BREAKING : జులై 22వ తేదీన కేంద్ర బడ్జెట్‌!

-

మరికొద్ది రోజుల్లో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. మరోవైపు వచ్చే నెలలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. జులై 22 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు ఈ సెషన్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో తొలి రోజే కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్‌ ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. తొలి రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. అంతకంటే ముందు ప్రత్యేక సమావేశాల చివరి రోజైన జులై 3న ఆర్థిక సర్వేను పార్లమెంట్‌ ఎదుట ఉంచనున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరోవైపు కొత్తగా ఏర్పడిన 18వ లోక్‌సభ సమావేశాలు జూన్‌ 24 నుంచి జులై 3వ తేదీ వరకు జరగనున్నాయి. తొలివిడత సమావేశంలో సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్‌ ఎన్నికకు తీసుకునే సమయాన్ని మినహాయిస్తే కేవలం అయిదు పనిదినాలే ఉంటాయి. ఈ స్వల్పకాలంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టి, దానిపై చర్చించడం సాధ్యం కాదని భావించిన కేంద్రం.. వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news