ఇంస్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ను కలిగి ఉన్న బాలీవుడ్ భామలు..!!

సోషల్ మీడియా వేదిక గా సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికి క్రేజ్ బాగా పెరిగిపోయిందని చెప్పాలి. ఇక సెలబ్రిటీల విషయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీరు తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. మరింత ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా వారు పెట్టే అప్డేట్స్ కూడా మరింత పాపులర్ అవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా మన స్టార్ సెలబ్రిటీలు ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని బిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకోవడమే కాకుండా ఒక్కొక్క పోస్టు ద్వారా కొన్ని లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు. ఇకపోతే బాలీవుడ్ విషయానికి వస్తే ఇన్స్టా గ్రామ్ వేదికగా ఎక్కువ ఫాలోవర్స్ ను కలిగి ఉన్న సెలబ్రిటీ భామల గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

ప్రియాంక చోప్రా:

ఇంటర్నేషనల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ చిత్రాలలో, వెబ్ సిరీస్ లలో ఫుల్ బిజీగా ఉంది . ఇంస్టాగ్రామ్ ద్వారా 80.9 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉంది. ఇంస్టాగ్రామ్ ద్వారా పెట్టే ఒక పోస్ట్ కు 10 లక్షల రూపాయల వరకు పారితోషకం అందుకుంటుంది.

శ్రద్ధా కపూర్:


ఇంస్టాగ్రామ్ లో 73.8 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకొని , రెండవ స్థానంలో ఉంది. ఇక సాహో సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె బాలీవుడ్లో పలు క్రేజీ ప్రాజెక్టులలో ఫుల్ బిజీగా మారింది.

నేహా కక్కర్:Birthday Special: Top 7 songs of Neha Kakkarప్రముఖ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇంస్టాగ్రామ్ లో 70.4 మిలియన్ ఫాలోవర్ ను సొంతం చేసుకొని ఆ రేంజ్ లో ఫాలోయింగ్ ఉన్న సింగర్ గా రికార్డు క్రియేట్ చేసింది.

ఇక అలియా భట్ – 68.4 మిలియన్ ఫాలోవర్స్, దీపికా పదుకొనే – 68.2 మిలియన్ ఫాలోవర్స్, కత్రినా కైఫ్ 66.1 మిలియన్ ఫాలోవర్స్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ – 62.6 మిలియన్ ఫాలోవర్స్, అనుష్క శర్మ – 59.4 మిలియన్ ఫాలోవర్స్, ఊర్వశీ రౌటెల – 53.8 మిలియన్ ఫాలోవర్స్, సన్నీ లియోన్ – 53.3 మిలియన్ ఫాలోవర్స్, దిశా పటాని – 52.8 మిలియన్ ఫాలోవర్స్, కృతి సనన్ – 50.1 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు.