Bro: సాయి ధరంతేజ్ ఖాతాలో మరో హిట్.. అదరగొడుతున్న ఫస్ట్ సింగిల్..!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరంతేజ్ మొదటిసారి నటిస్తున్న చిత్రం బ్రో. సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ వినోదయ సీతంకి రీమేక్ గా వస్తోంది. ఇక తమిళ్ లో చేసిన సముద్రఖని ఈ సినిమాను రీమేక్ చేస్తూ డైరెక్ట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ రిలీజ్ అయ్యి మూవీ పై అంచనాలు భారీగా క్రియేట్ చేయగా.. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమాలోని పాటని కూడా తాజాగా రిలీజ్ కి సిద్ధం చేస్తున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్.. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్ లిరికల్ వీడియోని విడుదల చేశారు. ఇందులో” మై డియర్ మార్కండేయ” అంటూ వచ్చే ఈ క్లబ్ సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురాగా మామ అల్లుళ్ళు కలిసి బాలీవుడ్ భామ ఊర్వశి తో చిందులేసి అందరిని అలరించారు. ఇక ఈ పాట అందరిని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఈ పాటతో సినిమా ఖచ్చితంగా హిట్టు కొట్టేలా కనిపిస్తోంది అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

విరూపాక్ష సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సాయిధరమ్ తేజ్ బ్రో సినిమాతో కూడా హిట్ ను తన ఖాతాలో వేసుకోబోతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.. ఇకపోతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో నటించనున్నారు. పీపుల్ మేడ్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందివ్వడం జరిగింది. ఈ సినిమా జూలై 28వ తేదీన విడుదల కాబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news