రామ్ చరణ్ సినిమాలో విజయ్ సేతుపతి… !

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ దర్శకుడు శంకర్ తో గేమ్ చేంజర్ పేరుతో పొలిటికల్ గేమ్ ను తయారు చేస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ పాత్ర మునుపెన్నడూ లేని విధంగా శంకర్ డిజైన్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమా అనంతరం రామ్ చరణ్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో సినిమాకు కమిట్ అయ్యాడు. ఉప్పెన తో కనీవినీ ఎరుగని విధంగా హిట్ కొట్టిన దర్శకుడిగా బుచ్చిబాబుకు టాలీవుడ్ లో మంచి పేరొచ్చింది. ఆ ప్రభావమే బుచ్చిబాబు రామ్ చరణ్ కథ చెప్పగానే ఒప్పేసుకున్నాడు. ఈ సినిమా నుండి ఒక వార్త ప్రేక్షకులకు టెంప్టింగ్ గా ఉంది, ఇందులో ఒక కీలక పాత్రను చేయడానికి తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి తీసుకుంటున్నారట.

ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా కావడంతో ఎమోషనల్ గా నటించే నటుడు కోసం విజయ్ సేతుపతిని సంప్రదించారట. ఇక ఉప్పెనలో చేశాడు కాబట్టి.. మరో మాట మాట్లాడకుండా ఓకే చెప్పేశారని వినికిడి.

Read more RELATED
Recommended to you

Latest news