BroTeaser : ఇవాళ సాయంత్రం 5.04 గంటలకు గెట్ రెడీ

-

BRO : ‘బ్రో’ సినిమా టీజర్ కు ముహుర్తం ఫిక్స్ అయింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీ బ్రో. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమా తమిళ్ లో హిట్ అయిన వినోధయ సీతం కు రీమేక్ అని తెలిసిందే.

ఈ సినిమాను విలక్షణ నటుడు మరియు దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జులై 28న రిలీజ్​కు రెడీ అవుతోంది. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. పవర్ స్టార్ స్వాగ్ సూపర్​గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే…తాజాగా BRO : ‘బ్రో’ సినిమా టీజర్ కు ముహుర్తం ఫిక్స్ అయింది. ఈ సినిమా టీజర్‌ ఇవాళ సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్‌ చేయనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news