స‌మంత‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. మ‌రో ప్యాన్ ఇండియా ప్రాజెక్టులో సామ్‌!

-

సినీ ఇండ‌స్ట్రీలో స‌మంత ఓ ప‌డిలేచిన కెర‌టం అనే చెప్పాలి. ఆమె ప‌ని ఇక అయిపోయింది అనుకున్న ప్ర‌తిసారి ఆమె త‌న ట్యాలెంట్ ఏంటో నిరూపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అంద‌రికంటే త‌న ట్యాలెంట్‌తోనే మెప్పించి ఓటీటీలో వెబ్‌సిరీస్‌ల ద్వారా దుమ్ములేపుతోంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ విష‌యంలో కాజ‌ల్‌, త‌మ‌న్నా ఫెయిల్ అయినా స‌మంత మాత్రం సూప‌ర్ స‌క్సెస్ అయింది.

 

మొద‌టి నుంచి విమ‌ర్శ‌ల వ‌చ్చిన‌ప్ప‌టికీ ది ఫ్యామిలీ మ్యాన్ 2 తో ప్యాన్ ఇండియా లెవ‌ల్ సక్సెస్ ను అందుకుంది. త‌న న‌ట‌న‌తో విమ‌ర్శ‌కుల నోళ్లు మూయించింది. ఎన్ని వివాదాలు అడ్డు వ‌చ్చినా.. త‌న ట్యాలెంట్ చివ‌రకు వాట‌న్నింటికీ స‌మాధానం చెప్పింది. ఇప్పుడు దీన్ని హిందీ భాషలో కూడా స్ట్రీమింగ్ చేస్తున్నారు మేక‌ర్స్‌.

ఈక్రేజ్‌తో ఇప్పుడు సామ్‌కి మ‌ళ్లీ ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ 2 కంటే కూడా డ‌బుల్ రెమ్యేన‌రేష‌న్ ఇస్తామ‌ని చాలామంది ముందుకొస్తున్నార‌ని తెలుస్తోంది. ఒక లేడీ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ లో సమంత ప్ర‌ధాన పాత్ర‌గా చేసేందుకు ఓ ఫేమ‌స్ దర్శకుడు ఇప్ప‌టికే ప్లాన్ చేస్తున్నారంట‌. నెట్ ప్లిక్స్ వారు డైరెక్టుగా పెట్టుబ‌డి పెడుతున్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఈ సిరీస్ తో కూడా సమంత మళ్లీ పాన్ ఇండియా రేంజ్ హిట్ కొడుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news