కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది ఇబ్బందుల్లో పడిపోయారు. దీని వల్ల ఎన్నో సమస్యలు వచ్చాయి. అయితే ఇప్పుడు వ్యాక్సినేషన్ కూడా జరుగుతోంది. ఇది ఇలా ఉంటే పిల్లల కోసం రష్యా గమలైయా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమొలజీ అండ్ మైక్రో బయాలజీ పిల్లల్లో వ్యాక్సిన్ కోసం కొత్త పద్ధతిని మొదలు పెట్టనుంది.
మాములుగా కాకుండా నాజల్ ద్వారా వ్యాక్సిన్ ని ఇవ్వనుంది. ఇది ఎనిమిది సంవత్సరాల నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లలకి పని చేస్తుంది. అయితే ఇది సెప్టెంబర్ 15 లోగా తయారై పోతుందని అన్నారు.
నీడిల్ కి బదులుగా నాజిల్ ద్వారా దీనిని ఇస్తామని అన్నారు. అయితే వ్యాక్సిన్ మాత్రం ఒకటే. రీసెర్చ్ లో 8 నుండి 12 సంవత్సరాల పిల్లలకి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు.
కనీసం బాడీ టెంపరేచర్ కూడా పెరగలేదు. అదే వ్యాక్సిన్ ని నాజల్ స్ప్రే ద్వారా ఇస్తున్నామని.. మంచిగా ఉందని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు హైదరాబాద్ బేస్డ్ భారత్ బయోటెక్ క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహిస్తోంది.