హీరో, హీరోయిన్ మధ్యలో చిచ్చు పెట్టిన డ్రైవర్..!

-

బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తన కన్నా 13 ఏళ్లు పెద్దదైన మలైకా అరోరాతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న విషయం ఇప్పటికే బాలీవుడ్ మీడియా అంతా కోడై కూస్తుంది. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ భార్య అయిన మలైకా వారు విడిపోయాక అర్జున్ కపూర్ తో రిలేషన్ పెట్టుకుంది మలైకా. అర్జున్ తో ప్రేమాయణం పెళ్లిదాకా వచ్చిందని అన్నారు. అయితే ఏమైందో ఏమో కాని ఈమధ్య అర్జున్, మలైకా మధ్యలో కూడా చిన్న డిస్టబెన్స్ వచ్చిందట.

మలైకా, అర్జున్ ల మధ్య చిచ్చు పెట్టింది ఎవరో కాదు మలైకా కారు డ్రైవర్ అని అంటున్నారు. ఆమె డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి అర్బాజ్ ఖాన్ కారు డ్రైవర్ కు సోదరుడే అట. అందుకే అక్కడ వార్తలు ఇక్కడ ఇక్కడ వార్తలు అక్కడకు మోయడంతో అర్జున్ కపూర్ కు ఈ వ్యవహారం అంతా తెలిసి మలైకాని దూరం పెట్టాడట. ఇప్పటికే అర్జున్ మలైకాతో తిరగడం నచ్చని సల్మాన్ బోనీ కపూర్ సినిమా చేసేది లేదని చెప్పేస్తున్నాడు.

మరి తనకన్నా 13 ఏళ్ల వయసున్న అమ్మాయిని ప్రేమించడం ఏంటో ఆమెతో పెళ్లికి రెడీ అయ్యాక వారి మధ్య ఇలాంటి మనస్పర్ధలు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి అర్జున్, మలైకా మళ్లీ కలుస్తారా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version