కరోనా ఎఫ్ఫెక్ట్ తో ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ మధ్య భారీ పోటీ..?

-

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ రైటర్ నుండి డైరెక్టరుగా మారి బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న వాళ్ళకి నిర్మాతలు, హీరోలు ఎర్ర తివాచి పరిచి మరీ కథ వినడానికి ఆహ్వానిస్తారు. క్యూలో ఎవరున్న కూడా ముందు కథ వినాలంటే నిర్మాతలు, హీరోలు ముందు వీళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తారు. అలా ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ అంటే కొరటాల శివ, బోయపాటి శ్రీను అని చెప్పాలి. అయితే బోయపాటి ఫస్ట్ సినిమా ‘భద్ర’ తో మాస్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో మంచి పేరు ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత స్టార్ హీరోల తో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు.

 

ముఖ్యంగా నందమూరి నట సింహం బాలకృష్ణ తో సింహా, లెజెండ్ ..అలాగే అల్లు అర్జున్ తో సరైనోడు సినిమాలతో మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే వినయ విధేయ రామ ఫ్లాప్ కావడం తో బోయపాటి టాలీవుడ్ లో అన్ని రకాలుగా దెబ్బ తిన్నాడడౌన్ అయ్యాడు. ప్రస్తుతం బోయపాటి నందమూరి బాలకృష్ణతో హ్యాట్రిక్ హిట్ కోసం టరి చేస్తున్నారు. ఇక కొరటాల శివ ప్రభాస్ తో తెరకెక్కించిన ‘మిర్చి’ సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకొని టాలీవుడ్ ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా దూసుకుపోతున్నారు. మిర్చి తర్వాత మహేష్ బాబుతో శ్రీమంతుడు, భరత్ అనే నేను ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ప్రస్తుతం సక్సస్ ఫుల్ డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ ఇద్దరు తెరకెక్క్స్తున్న బాలయ్య, చిరంజీవి సినిమాలు ఒకే రోజున రిలీజ్ కానున్నాయని తాజా సమాచారం. కరోనా కారణంగా షూటింగ్స్ కి బ్రేక్ పడిన నేపథ్యంలో అన్ని సినిమాలకి షూటింగ్స్ బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఎఫెక్ట్ మాత్రం ఇద్దరు స్టార్ హీరోల మీద అలాగే ఇద్దరు స్టార్ డైరెక్టర్ మీద ఒత్తిడి పెంచేలా చేసింది. అంతేకాదు బాలయ్య చిరజీవి చాలా ఏళ్ళ తర్వాత బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నారని అర్థమవుతోంది. ఇద్దరు పెద్ద హీరోలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలపై భారీ అంచనాలే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news