బాలివుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పై కేసు నమోదు చేసారు పోలీసులు. ఒక ప్రకటనలో తమ మనోభావాలను ఆయన గాయపరిచారని పేర్కొంటూ కొందరు వ్యక్తులు ఆయనపై ఫిర్యాదు చేసారు. వివరాల్లోకి వెళితే ఇటీవల ఆయన ఓ డిటర్జెంట్ ప్రకటనలో నటించారు. ఈ ప్రకటనలో అక్షయ్ కుమార్ పాత్ర ఏంటి అంటే మరాఠా రాజు.
తన సేనతో కలిసి యుద్ధం గెలిచి విజయోత్సాహంతో తిరిగి రాగా అంత:పురంలోని వారందరూ వారికి ఘన స్వాగత౦ పలుకుతుంటే మహారాణి మాత్రం ఆగ్రహంగా ఉంటుంది. వారి మురికి బట్టలు ఎవరు ఉతుకుతారు అంటూ కామెంట్ చేసారు. వెంటనే స్పందించిన అక్షయ్ ఓ యోధుడిలా బట్టలు ఉతుకుతారు.
ఈ ప్రకటన తన మనోభావాలకు విరుద్దంగా ఉందని కొందరు ముంబై లోని వర్లీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఈ ప్రకటనలో మరాఠా సంస్కృతిని, మరాఠా రాజుల వీరత్వాన్ని అవమానించారని ఆయనపై కేసు నమోదు చేసారు. దీనిపై అక్షయ్ తమకు క్షమాపణ చెప్పాలని ఆ వీడియోని డిలీట్ చెయ్యాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.