కో అంటే కోటి.. షాక్ ఇస్తున్న హీరోయిన్స్ రెమ్యునరేషన్..!

-

సినిమా ఎంత పెద్దదైనా సరే ఎన్ని కోట్ల బడ్జెట్ ఉన్నా సరే ఎంత పెద్ద స్టార్ హీరో నటిస్తున్నా దానికి కావాల్సిన గ్లామర్ ఉండాలంటే హీరోయిన్స్ కావాల్సిందే. సినిమాకు అసలు సిసలు అందం కథానాయికలే. ఒకప్పుడు హీరోయిన్స్ కు అంతగా ప్రాధాన్యత ఉండేది కాదు కాని ఇప్పుడు వారి టైం నడుస్తుంది. హీరోలకు సమానంగా పాత్రలను చేస్తున్నారు. అదే రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

టాలీవుడ్ క్రేజీ భామ రెమ్యునరేషన్ విషయాలు తెలిస్తే ముక్కున వేలేసుకోవడం ఖాయం. కేవలం హీరోలే కాదు ఈమధ్య హీరోయిన్స్ కూడా కోట్లకు పడలెత్తారు. తెలుగులో ఇప్పటివరకు అనుష్క ఒక్కో సినిమాకు మూడున్నర నుండి నాలుగు కోట్ల దాకా తీసుకుంటుందట. ఇక ఇదే రేంజ్ లో నయనతార కూడా ఒక్కో సినిమాకు 3 నుండి 4 కోట్లు చార్జ్ చేస్తుంది.

వీరిద్దరి తర్వాత ప్రస్తుతం ఫాం లో ఉన్న భామ పూజా హెగ్దె.. డీజే సినిమా తర్వాత అమ్మడి రేంజ్ మారిపోయింది.. మహేష్ మహర్షి, ప్రభాస్ జాన్ సినిమాలతో పూజా ఫుల్ ఫాంలో ఉంది. ప్రస్తుతం పూజా కోటి 70 లక్షల దాకా తీసుకుంటుందట. పెళ్లి తర్వాత కూడా సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికి సినిమాకు 2 కోట్లు వసూళు చేస్తుంది అక్కినేని కోడలు. ఇక కాజల్ కూడా సినిమాకు కోటిన్నర దాకా చార్జ్ చేస్తుందట.

ఇక ఆ తర్వాత తమన్నా, సాయి పల్లవి, రకుల్, కియరా అద్వాని వంటి హీరోయిన్స్ కోటి 20 లక్షల దాకా వచ్చారని తెలుస్తుంది. మొత్తానికి హీరోయిన్స్ కూఆ కో అంటే కోటి అంటూ సినిమా సినిమాకు తమ పారితోషికం పెంచుకుంటూ వెళ్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెత బాగా నోట్ చేసుకున్న ఈ భామలు రెమ్యునరేషన్ విషయంలో మాత్రం అసలు తగ్గట్లేదు.

Read more RELATED
Recommended to you

Latest news