పేరున్న హీరోయినే.. రూ.5 లక్షలు హోటల్ బిల్లు కట్టకుండా జంప్ ..?

34

కన్నడ నటి పూజా గాంధి బెంగళూరులో ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు బిల్లు ఎగ్గొట్టి వెళ్లడంతో ఆమెపై హోటల్ యాజమాన్యం కేసు పెట్టడం జరిగింది. దండుపాళ్యం సినిమాలో నటించిన పూజా గాంధి తన నటనతో అందరిని మెప్పించింది. కన్నడలో దాదాపు 30 సినిమాల్లో నటించిన పూజా గాంధి స్టార్ హోటల్ లో కొద్దిరోజులు ఉన్నదట. 4.5 లక్షల బిల్లు ఎగ్గొట్టి చెప్పాపెట్టకుండా అక్కడ నుండి వెళ్లిందట హోటల్ మేనేజ్మెంట్ ఆమెపై కేసు ఫైల్ చేశారు.

ఈ కేసు విషయమై పూజా గాంధి హోటల్ కు తను 2 లక్షల వరకు కట్టానని మిగతాది కట్టేందుకు కొద్దిగా టైం కావాలని అన్నదట. పోలీసుల సమక్షంలో హోటల్ యాజమాన్యంతో మిగిలిన మొత్తాన్ని కట్టేందుకు కొద్దిగా టైం అడిగిందని తెలుస్తుంది. అందుకు హోటల్ మేనేజ్ మెంట్ కూడా ఓకే చెప్పగా సమస్య సర్ధుమనిగిందట.