BREAKING: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో RJ శేఖర్ బాషాపై కేసు నమోదు

-

BREAKING: RJ శేఖర్ బాషా కు ఊహించని షాక్‌ తగిలింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో RJ శేఖర్ బాషా పై కేసు నమోదు అయింది. రాజ్‌తరుణ్‌, లావణ్య కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలోనే తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో RJ శేఖర్ బాషా పై కేసు నమోదు కావడం జరిగింది. లావణ్య పై దాడి చేయడంతో కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు.

Case registered against RJ Shekhar Basha in Jubilee Hills Police Station

ఓ యూట్యూబ్ ఛానల్ లో డిబేట్ అనంతరం లావణ్య పై రెచ్చిపోయాడట ఆర్జే శేఖర్ భాష. లావణ్యను బూతులు తిడుతూ దాడి చేశాడట శేఖర్ భాష. కడుపు మీద తన్ని చేతికి గాయం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు లావణ్య. శేఖర్ బాషా తో తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. దీంతో శేఖర్ బాషా పై సెక్షన్ 74 115(2) బిఎన్ఎస్ కింద కేసులు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news