నాగార్జున సాగర్ వద్ద కూలిపోయిన సుంకిశాల రిటెయినింగ్‌ వాల్..వీడియో వైరల్ !

-

నాగార్జున సాగర్ కు సంబంధించిన షాకింగ్ లైవ్ వీడియో బయటకు వచ్చింది. నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల రిటెయినింగ్‌ వాల్ కూప్పకూలడం జరిగింది. ఆగస్ట్ ఒకటవ తేదీన ఘటన జరిగినా బైటికి చెప్పకుండా దాచిపెట్టింది రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం. అధికారుల నిర్యక్ష్యం.. నాగార్జునసాగర్‌కు లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటం, నీటిమట్టం కూడా భారీగా ఉన్న సమయంలో రక్షణ గోడ వెనక గేటును ఏర్పాటు చేసి…

The retaining wall of the tank collapsed at Nagarjuna Sagar

సొరంగాన్ని పూర్తిస్థాయిలో ఓపెన్‌ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల రిటెయినింగ్‌ వాల్ కూప్పకూలిన సమయంలో కూలీలు లేరట. కూలీలు షిఫ్టు మారే సమయంలో జరగడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. ఇక ఈ సంఘటన జరిగిన తర్వాత క్షణాల్లో జల దిగ్బంధమైంది పంప్‌హౌస్‌. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

https://x.com/TeluguScribe/status/1821376479919297007

Read more RELATED
Recommended to you

Latest news