OTT సంస్థలకు కేంద్ర సర్కార్ కీలక ఆదేశాలు

-

ఓటీటీల్లో ప్రసారమవుతున్న కంటెంట్‌పై సెన్సార్ ఉండాలని చాలా కాలంగా డిబేట్ జరుగుతున్న విషయం తెలిసిందే. సెన్సార్ లేకపోవడం వల్ల ఓటీటీ అసభ్యపదజాలం, విచ్చలవిడి శృంగారం, మితిమీరిన హింసతో కూడిన కంటెంట్‌ను ఇష్టారీతిన ప్రసారం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఓటీటీ సంస్థలకు కేంద్ర సర్కార్ కీలక సూచన చేసింది. అశ్లీలత, హింసతో కూడిన కంటెంట్‌ను ప్రసారం చేసే ముందు ఓటీటీ సంస్థలు స్వీయ సమీక్ష చేయాలని కోరింది.

జూన్‌ 20వ తేదీన కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఓటీటీ సంస్థలతో సమావేశం జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ఈ ప్రతిపాదన చేసినట్లు సమాచారం. అయితే, ఈ ప్రతిపాదనలను ఓటీటీ సంస్థలు వ్యతిరేకించినట్లు తెలిసింది. దీంతో ఎలాంటి నిర్ణయం తీసుకుకోకుండానే సమావేశం ముగిసిందని ఓటీటీ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీలు, ప్రజాసంఘాల ప్రతినిధులు మాత్రం ఓటీటీలో ప్రసారమయ్యే కంటెంట్‌పై సమీక్ష కోసం ప్రత్యేక సెన్సార్‌షిప్‌ ఉండాల్సిందేనని స్పష్టం చేశారట.

Read more RELATED
Recommended to you

Latest news