8 ఏళ్ల తర్వాత వాటే ఇంట్రెస్టింగ్ ఫైట్..!

-

2010లో వచ్చిన ఏమాయ చేసావే సినిమా గుర్తుంది కదా నాగ చైతన్యకు జోష్ మొదటి సినిమానే అయినా ఏమాయ చేసావే సినిమాతోనే మొదటి హిట్ అందుకున్నాడు. గౌతం మీనన్ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ లో మంజుల నిర్మించారు. అయితే ఆ సినిమాలో నాగ చైతన్య, సమంత మాత్రమే కాదు మరో హీరో కూడా ఉన్నాడు. అతనే సుధీర్ బాబు.. సమంత బ్రదర్ గా ఆ సినిమాలో నటించింది సుధీర్ బాబే.

అయితే అప్పుడు తన చెల్లిని ప్రేమించాడని చైతుతో ఫైట్ చేసిన సుధీర్ బాబు మరోసారి బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమయ్యాడు. అప్పుడు సినిమాలో కొట్టుకున్న ఈ ఇద్దరు ఇప్పుడు వారి సినిమాలతో ఢీ కొడుతున్నారు. ఈ ఇద్దరే కాదు సమంత కూడా వీరిద్దరికి ధీటుగా వస్తుంది. సెప్టెంబర్ 13న చైతు శైలజా రెడ్డి అల్లుడు, సమంత యూటర్న్ తో పాటుగా, సుధీర్ బాబు చేసిన నన్ను దోచుకుందువటే.. సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

8 ఏళ్ల క్రితం ముగ్గురు ఒకే సినిమాలో నటించగా 8 ఏళ్ల తర్వాత ముగ్గురు 3 సినిమాలతో ఫైటింగ్ కు దిగుతున్నారు. సుధీర్ బాబు తన సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో ఎనౌన్స్ చేయగా సమంత కూడా ఆ డేట్ నే ఎంచుకుంది. అయితే ఈ నెల 31న రావాల్సిన శైలజా రెడ్డి అల్లుడు కూడా సెప్టెంబర్ 13న వస్తుంది. ఈ ఇంట్రెస్టింగ్ ఫైట్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news