టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రచయిత చంద్రబోస్ మామ, ఆయన భార్య సుచిత్ర తండ్రి చాంద్ భాష మృతి చెందారు. చాంద్ భాషా పలు చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు.
తెలుగులో ఖడ్గ తిక్కన్న, బంగారు సంకేళ్లు, స్నేహమేరా జీవితం, మానవుడే దేవుడు తదితర చిత్రాలకు సంగీతం అందించారు. అలాగే కన్నడలోని పలు చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు చాంద్ భాష. ఇక ఆయన అంతక్రియలు ఇవాళ హైదరాబాదులోని మహాప్రస్థానంలో జరగనున్నారు.