సనని వేధించిన దర్శకుడు

-

టాలీవుడ్ లో క్యారక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించిన సన తన కెరియర్ లో జరిగిన వేధింపుల గురించి ఈమధ్య ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తెలుగు, తమిళ భాషల్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న సన తెలుగులో చాలా సీరియల్స్, సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక కెరియర్ తొలినాళ్లలో ఓ కన్నడ సినిమా ఆఫర్ రాగా అందుకు ఓకే చెప్పిన ఆమె కన్నడ దర్శకుడి చేతిలో వేధింపులకు గురయ్యానని చెప్పింది.

తెలుగులో మంచి గుర్తింపు రాగా కన్నడ నిర్మాత తనని సెలెక్ట్ చేసుకున్నారని కాని కన్నడ దర్శకుడికి మాత్రం తనని సెలెక్ట్ చేయడం నచ్చలేదని అందుకే తనని కావాలని టార్గెట్ చేశారని చెప్పుకొచ్చింది సన. కావాలని సెట్స్ లో అవమానించే వాడని. పేజీలకొద్ది డైలాగ్ ఇచ్చి సింగిల్ టేక్ లో రావాలని చెప్పేవాడని. తన మీద ఎక్కువగా కోప్పడేవాడని అన్నది. ఒకసారి తన వేధింపులు భరించలేక తాను ఏడ్చానని చెప్పుకొచ్చింది సన.

అయితే ఆ దర్శకుడు పేరు మాత్రం బయటకు చెప్పలేదు సన. ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేస్తున్న ఆమె మిగతా భాషల్లో నటించే ఆలోచన లేదని తెగేసి చెబుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version