బన్నీ పుష్ప-2లో చరణ్ పాత్ర అదే ?

-

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్..‘పుష్ప’ చిత్రంతో ఐకాన్ స్టార్ ప్లస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ‘పుష్ప’ రాజ్ గా అల్లు అర్జున్ నటనకు ప్రేక్షక లోకం ఫిదా అయింది. కాగా, తాజాగా ఈ సినిమాలో అనగా ‘పుష్ప’రాజ్ ..సీక్వెల్ లో.. ఎవరూ ఊహించని సర్ ప్రైజెస్ ను దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అయితే ఇప్పుడు సోషల్ మీడియా లో వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుష్ప 2లో కీలకపాత్రలో నటిస్తున్నారట. ఈ సినిమాలో ఓ కలెక్టర్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారని సమాచారం. అయితే ఈ వార్తపై అధికారికంగా చిత్ర బృందం ప్రకటన చేయనప్పటికీ… ఈ వార్తలో నిజం ఉందని టాలీవుడ్ కోడైకొస్తుంది. మరి దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news