పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇది నిజంగానే గుడ్ న్యూస్ అని చెప్పాలి. మెగా అభిమానులు అందరూ పండుగ చేసుకునే రోజు త్వరలోనే రానుందని తెలుస్తోంది. రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 2024 ఎన్నికల కోసం కసరత్తులు చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లోగా పార్టీని బలోపేతం చేసుకోవడానికి అందివచ్చిన అవకాశాలతో ముందుకు వెళ్తున్నాడు. కానీ పార్టీని మళ్ళీ వచ్చే ఎన్నికల నాటి వరకూ నడపాలంటే మాములు విషయం కాదు.
![Che Guevara biopic In Pawan Kalyan Che Guevara biopic In Pawan Kalyan](https://cdn.manalokam.com/wp-content/uploads/2019/08/pawan-kalyan.jpg)
ఆర్ధికంగా ఎంతో బలంగా ఉండాలి. కానీ గత రెండేళ్లుగా సినిమాలు చేయకుండా రాజకీయాలకే పరిమితమైన పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు ఆర్ధిక సమస్యలు రాకుండా మానవు. ఇప్పటికే ఎంతోమంది డొనేషన్లని పార్టీ ఫండ్ గా ఇస్తున్నా అవి వచ్చే ఎన్నికల వరకూ ఏ మేరకు సరిపోతాయి అనేది మాత్రం ప్రశ్నార్ధకమే. ఎన్ని ఆర్ధిక సమస్యలు వెంటాడినా సినిమాలలో నటించనని చెప్పిన పవన్ కళ్యాణ్ తాజాగా తన మనసు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది.
టాలీవుడ్ లో విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ మళ్ళీ మేకప్ వేసుకోనున్నారట. అంతేకాదు ఆయన హీరోగా, నిర్మాతగా మారనున్నారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. పవన్ ఓ బయోపిక్ ద్వారా టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దం అయ్యారట. ఈ బయోపిక్ దర్సకత్వ భాద్యతలు నాగ్ అశ్విన్ కి గాని లేదా శేఖర్ కమ్ములకి కానీ ఇవ్వనున్నారట. భావోద్వేగాలు పలికించడంలో ఈ ఇద్దరూ ఎంతో అద్భుతమైన ఔట్ పుట్ ఇస్తారని నమ్మిన పవన్ కళ్యాణ్ త్వరలో ఈ బయోపిక్ ని పట్టాలపైకి ఎక్కించనున్నారట. ఇంతకీ పవన్ కళ్యాణ్ తీయబోయే బయోపిక్ ఎవరిదో కాదు..
తన జీవితానికి స్పూర్తిగా నిలిచినా విప్లవ వీరుడు, తాడిత పీడిత ప్రజల ఆరాధ్యుడు చెగువేరా. తన ప్రతీ సినిమాలో ఎదో ఒక సందర్భంలో చెగువేరా ని చూపించే పవన్ కళ్యాణ్ కి ఆ వీరుడు అంటే ఎనలేని అభిమానం. ఇకపై సినిమాలు తీస్తే స్పూర్తివంతమైన సినిమాలనే తీయాలని అనుకున్న పవన్ కళ్యాణ్ చెగువేరా జీవితాన్ని బయోపిక్ ద్వారా తెలుగు ప్రజలకి మరింత చేరువ చేయాలని భావిస్తున్నాడట. పవన్ కళ్యాణ్ నిర్మించి నటించనున్న ఈ బయోపిక్ వార్తల్లో ఎంతవరకూ నిజం ఉందొ తెలియదు కానీ అభిమానులు మాత్రం పవన్ నుంచీ ఈ ప్రకటన ఎప్పుడు వస్తుందో అంటూ ఎదురు చూస్తున్నారు.