చీకటి గదిలో చితక్కొట్టుడు ట్రైలర్.. ఓన్లీ సింగిల్స్.. ఫ్యామిలీస్ నాట్ ఎలోడ్..!

-

బాలీవుడ్ లో లానే తెలుగు సినిమాల్లో అడల్ట్ కంటెంట్ తో కొన్ని సినిమాలు వస్తుంటాయి. అయితే మన ఆడియెన్స్ కు అది రోత అనిపించొచ్చు కాని ఆ సినిమాలను చూసి ఎంజాయ్ చేసే ప్రేక్షకులు ఉంటారు. ఇక అలాంటి సినిమా టీజర్, ట్రైలర్ తోనే సినిమా మీద ఓ క్రేజ్ తెచ్చుకుంటాయి. లేటెస్ట్ గా అలాంటి అడల్ట్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా చీకటి గదిలో చితక్కొట్టుడు. ఆదిత్, నిక్కి తంబోలి లీడ్ రోల్స్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం రిలీజైంది.

ట్రైలర్ చూస్తే పక్కా బూతు కంటెంట్ తో కాస్త కామెడీ.. హర్రర్ మిక్స్ చేసినట్టు తెలుస్తుంది. మిర్చి హేమంత్ కూడా ఈ సినిమాలో స్కోప్ ఉన్న రోల్ చేసినట్టు తెలుస్తుంది. ట్రైలర్ ఆద్యంతం యూత్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసేలా ఉండగా సినిమా చివర్లో ఇది ఓన్లీ సింగిల్స్.. ఫ్యామిలీస్ నాట్ ఎలోడ్ అంటూ డైరెక్ట్ గా ఓ డైలాగ్ చెప్పించేశాడు. అడల్ట్ కామెడీ జానర్ తో వస్తున్న చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమా ట్రైలర్ మసాలా ఘాటు బాగానే ఉండగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news