‘గాడ్ ఫాదర్’ కోసం సల్మాన్ తో చిరు​ స్టెప్పులు.. బాక్సాఫీస్​ షేక్​!

-

నటనలో మెగాస్టార్ కు పోటీ ఎవరూ లేరు. ముఖ్యంగా అదిరిపోయే స్టెప్పులేయడంలో ఆయన్ని మించిన వాళ్లెవరూ లేరు. ఇక ఆయనతో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ జత కడితే.. ఊహించుకోవడానికే అదిరిపోయిందిగా. కానీ ఇది ఊహ కాదు.. నిజం. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్పులేయనున్నారు.

చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గాడ్ ఫాదర్ లో కీలక పాత్రలో సల్మాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే కేవలం నటించడమే కాదు.. వాళ్లిద్దరు కలిసి ఒకే పాటకు చిందేయనున్నారట. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టారే ట్విటర్ వేదికగా పంచుకున్నారు.

గాడ్ ఫాదర్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ కోసం సల్మాన్‌తో కలిసి డ్యాన్స్‌ చేసినట్లు చిరంజీవి చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో పంచుకుంటూ, ‘గాడ్‌ఫాదర్‌ కోసం భాయ్‌ సల్మాన్‌తో కలిసి డ్యాన్స్‌ చేశా. ప్రభుదేవా కొరియోగ్రఫీ అద్భుతం. అభిమానులకు కనులపండగే’ అని ట్వీట్‌ చేశారు.


చిరంజీవి హీరోగా నటిస్తున్న 153వ చిత్రమిది. ఇందులో నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలందిస్తున్నారు. ఈ ఏడాది విజయదశమి సందర్భంగా సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్‌’ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news