రియల్‌మీ ఫ్లాట్ మానిటర్ సేల్ నేడే..23.8 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, స్మార్ట్ డిజైన్ తో..

-

రియల్‌మీ బ్రాండ్ వస్తువుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..మొబైల్స్, ల్యాప్ టాప్,టీవీ లు ఇలా అన్నీ రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తుంది.వాటికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు మరో వస్తువును కూడా లాంచ్ చేసింది.రియల్‌మీ నుంచి లాంచ్ అయిన తొలి మానిటర్ నేడు (జూలై 29) సేల్‌కు వచ్చింది. రియల్‌మీ ఫ్లాట్ మానిటర్ సేల్‌ నేటి మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం అయ్యింది. గతవారం రియల్‌మీ ప్యాడ్ ఎక్స్, వాచ్ 3 బ్లూటూత్ కాలింగ్ వాచ్‌, బడ్స్ 3 నియో టీడబ్ల్యూఎస్‌ ఇయర్‌బడ్స్, బడ్స్ వైర్‌లెస్‌ 2ఎస్‌తో పాటు ఈ మానిటర్‌ను రియల్‌మీ లాంచ్ చేసింది. 23.8 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో రియల్‌మీ ఫ్లాట్ మానిటర్ వస్తోంది. చాలా స్లిమ్‌గా బెజిల్‌లెస్ డిజైన్‌తో లుక్ పరంగా స్టైలిష్‌గా కనిపిస్తుంది. 75Hz రిఫ్రెష్ రేట్ కూడా హైలైట్‌గా నిలుస్తోంది. ఈ టీవీ ధర స్పెసిఫికెషన్లు, ధర గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

- Advertisement -

 

స్పెసిఫికేషన్లు..

1920×1080 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉండే 23.8 ఇంచుల Full HD LED డిస్‌ప్లేతో రియల్‌మీ ఫ్లాట్ మానిటర్ వస్తోంది. 70Hz రిఫ్రెష్ రేట్ ఉండడంతో వీడియో వ్యూయింగ్, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ స్మూత్‌గా ఉంటుందని రియల్‌మీ పేర్కొంది. 250 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ ఉంటాయి. అలాగే ఇది యాంటీ గ్లేర్ డిస్‌ప్లేగా ఉంది.డిస్‌ప్లే మూడు సైడ్స్ అంచులు చాలా తక్కువగా ఉండే బెజిల్‌లెస్ డిజైన్‌తో మార్కెట్ లోకి రానుంది..

కనెక్టివిటీ కోసం, హెచ్‌డీఎంఐ పోర్ట్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, వీజీఏ పోర్ట్‌ ఈ మానిటర్‌కు ఉంటాయి. డీసీ పవర్ ఇన్‌పుట్ ఉంటుంది. ఈ మానిటర్‌కు వెబ్‌క్యామ్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉండదు.ఇప్పుడు రియల్‌మీ మూడు సంవత్సరాల వారెంటీ ఇస్తోంది. ఈ రియల్‌మీ ఫ్లాట్ మానిటర్‌కు ఇది మరో హైలైట్‌గా ఉంది. రూ.10,999 ధరకు ఈ మానిటర్ మంచి ఆప్షన్‌గా కనిపిస్తోంది.

ధర..

రియల్‌మీ ఫ్లాట్ మానిటర్ సాధారణ ధర రూ.12,999గా ఉంది. అయితే ఇంట్రడక్టరీ ఆఫర్‌గా మొదటి సేల్‌లో రూ.10,999 ధరకే అందుబాటులోకి రానుంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌ లో ఈ మానిటర్ సేల్‌కు వస్తుంది..ఈ టీవీ ఈరోజు మార్కెట్ లోకి వచ్చింది. ఫీచర్స్ బాగుండటం తో భారీ సేల్ నడుస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...