సీఎం కూడా క్వారెంటైన్‌కి వెళ్లాల్సిందేనా?

క‌రోనా వైర‌స్ ఉదృతి త‌గ్గిపోయింది మ‌న‌కేంకాదు అని చాలా మంది సెల‌బ్రిటీలు విచ్చ‌ల‌విడిగా తిరిగేస్తున్నారు. వారితో పాటు మిగ‌తా వారు కూడా ఆ త‌రువాత క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డి అవ్ర అనారోగ్యానికి గురైన ప్ర‌ముఖ గాయ‌కుడు, గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం క‌రోనా బారిన ప‌డి మృతి చెందిన విష‌యం తెలిసిందే.

అయిన మృతికి యావ‌త్ భార‌తం శోక‌సంద్రంలో మునిగిపోయింది. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఓ మ్యూజిక్ షోలో పాల్గొన‌డం వ‌ల్లే ఆయ‌న క‌రోనా బారిన ప‌డ్డారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికి ఆ షో వ‌ల్లే ఆయ‌న క‌రోనా బారిన ప‌డి తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయార‌ని సంగీత ప్రియులు, ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. ఇదిలా వుంటే తాజా డా. రాజ‌శేఖ‌ర్ క‌రోనా బారిన ప‌డి కోలుకుంటున్నారు. తాజాగా చిరుకు కూడా క‌రోనా సోక‌డం ప‌ల‌వురిని ఆందోళ‌న‌కు గురిచేస్తోంది.

ఇదిలా వుంటే ఆయ‌న రెండు రోజుల క్రితం తెలంగాణ ముఖ్య‌మంత్రిని మాస్కు లేకుండా క‌లిసి ముచ్చ‌టించారు. వ‌ర‌ద సాహంకు సంబంధించిన చెక్కుని అందించే క్ర‌మంలో సీఎం కేసీఆర్‌ని క‌లిసిన ఆయ‌న కొంత సేపు ముచ్చ‌టించారు. ప‌క్క‌నే న‌డుస్తూ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని సీఎం కేసీఆర్‌తో పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా చిరు ఫేస్‌కు మాస్క్‌లేని ఫొటోలు ఇప్ప‌డు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. ప‌క్క‌నే కింగ్ నాగార్జున కూడా వుండ‌టంతో తెరాస పార్టీ వ‌ర్గాల‌తో పాలు ప‌లువురు చిరుకు క‌రోనా సోకిన విష‌యం తెలిసి భ‌య‌ప‌డుతున్నార‌ట‌.