చిరంజీవి రూ. కోటి విరాళం.. సినీ కార్మికుల కోసం రంగంలోకి మెగాస్టార్

-

కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. దీని ధాటికి భారతదేశం సైతం వణికి పోతోంది. ఇప్పటికే దేశంలో దాదాపు 700 మందికి కరోనా సోకింది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా స్వైర విహారం చేస్తోంది. రోజురోజుకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా దెబ్బకు ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు.

కరోనా దెబ్బకు సినిమా పరిశ్రమ మొత్తం కుదేలవుతోంది. గత రెండు వారాలుగా సినీ పరిశ్రమ మూత పడిపోయింది. అన్ని కార్యకలాపాలు మూత పడ్డాయి. షూటింగ్స్ అన్నింటిని రద్దు చేయడంతో దినసరి కూలీల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. అయితే ఈ క్రమంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు పెద్దలందరూ ముందుకు వస్తున్నారు.

సినీ కార్మికుల కోసం రూ. కోటి విరాళాన్ని ప్రకటించి చిరంజీవి పెద్ద మనసును చాటుకున్నాడు. ‘కరోనాను ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ నిర్ణయం తప్పని సరి.. ఇలాంటి సమయంలో దేశంలో, తెలుగు సినీ పరిశ్రమలోని రోజూ వారి కూలీల జీవితాలపై ఎనలేని ప్రభావాన్ని చూపుతుంది.. దీన్ని దృష్టిలో పెట్టుకుని సినీ కార్మికులకు కోటి రూపాయల విరాళాన్ని అందిస్తున్నా’ని ట్వీట్ చేశాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news