చిన్నారి టాలెంట్‌కు చిరంజీవి ఫిదా.. ఇంటికి ఆహ్వానించి మరీ..

-

టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేయడంలో మెగాస్టార్ చిరవంజీవి ఎప్పుడూ ముందే ఉంటారు. ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆయన టాలెంట్​కు పట్టమే కడుతున్నారు. ఎక్కడ టాలెంట్ ఉన్న వారు కనిపించినా వెంటనే వారిని అభినందిస్తున్నారు. మరీ మనసుకు నచ్చితే ఇంటికి పిలిచి మరీ ఆశీర్వదిస్తున్నారు. తాజాగా ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సీజన్ 2’ కంటెస్టెంట్‌ అయ్యన్‌ ప్రణతి ప్రతిభకు చిరంజీవి ఫిదా అయ్యారు.

ఆమెను ఇంటికి పిలిచి మరీ మెగాస్టార్ అభినందించారు. వైజాగ్‌కు చెందిన ప్రణతి తన సింగింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా మెగాస్టార్ ఇంటికి పిలిపించుకుని అన్నమాచార్య కీర్తనను పాడించుకున్నారు. చిరంజీవి దంపతులు ఆమెతో కాసేపు సరదాగా గడిపారు.

‘చిరంజీవి సినిమాలు చూస్తు పెరిగిన నేను.. ఆయన ముందు పాడడం మాటల్లో చెప్పలేని అనుభూతినిచ్చింది. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. ఎన్నో రోజుల కల ఈరోజు నెరవేరింది. ఆయన్ని కలిసిన తర్వాత నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. రానున్న ఎపిసోడ్‌లలో ఇంకా బాగా పాడాలని చిరు దంపతులు నన్ను ఆశీర్వదించారు’ అని ప్రణతి తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news