అడవి శేష్: చిరంజీవి గారు మీరే మా ఇన్స్పిరేషన్..!!

-

తెలుగులో మంచి హీరోలలో అడవి శేష్ ఒకరు. తాను సినిమా కోసం తన ప్రాణం పెట్టి మరీ పనిచేస్తాడు. మహేష్ బాబు, నమ్రత నిర్మించిన మేజర్ సినిమా తనను పాన్ ఇండియా స్టార్ ను చేసింది. ఉత్తరాది ప్రేక్షకులు తనని విపరీతంగా అభిమానిస్తున్నారు. తాజాగా మేజర్ చిత్రానికి గానూ మెగాస్టార్ చిరంజీవి నుంచి అవార్డ్ అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తన ఆనందం పంచుకున్నాడు.

చిరంజీవి గారు మీరంటే నాకు చాలా ఇష్టం.చిన్నప్పుడు మీ ల టిక్కెట్ల కోసం నేను థియేటర్ల వద్ద ఫైటింగ్ చేసిన రోజులు.. నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అక్కడ నుంచి ఒకరోజు మధ్యాహ్నం మొత్తం మీతో మేజర్ గురించి మీతో మాట్లాడాను అనే విషయం నన్ను చాలా సంతోష పెట్టింది. అది నాకు చాలా గౌరవంగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు మీ నుంచి మేజర్ చిత్రానికి అవార్డును అందుకోవడం అంటే నాకు ప్రపంచంలోనే మాటల్లో చెప్పలేని మూమెంట్  మెగాస్టార్ చిరంజీవి గారికి థాంక్యూ సోమచ్. ‘ అంటూ చిరుతో అవార్డ్ అందుకున్న ఫోటోస్ షేర్ చేశారు.

ఇక రీసెంట్ గా కూడా  అడవిశేష్  హిట్ కొట్టాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ 2 లో అతను పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా  అదరగొట్టాడు ఈ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ మాధ్యమం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా మంచి వ్యూస్ తో నడుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news