తారక రత్న కోలుకుంటున్నాడు – చిరంజీవి ట్వీట్‌

 

నటుడు నందమూరి వారసుడు తారకరత్న ఇటీవల గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ కుప్పంలో ప్రారంభించిన యువగలం పాదయాత్రలో తారకరత్న పాల్గొని.. కొద్దిసేపు నడవగానే స్పృహ తప్పి పడిపోయారు. దీంతో పరిస్థితి విషమంగా ఉండడంతో కుప్పం నుండి బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి ఆయనను తరలించారు.

ప్రస్తుతం ఆయనను కాపాడేందుకు వైద్యులు అహర్నిశలు ప్రయత్నిస్తున్నారని ఇప్పటికే నందమూరి కుటుంబ సభ్యులకు కూడా మీడియాతో వెల్లడించారు. అయితే, తారక రత్న కోలుకుంటున్నాడంటూ మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేశారు. సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు, ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చిందని తెలిపారు. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ,ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు అంటూ మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేశారు.