కష్టపడితేనే తనకు తృప్తి.. హీరోయిజంపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

-

సినిమాల్లో ఎంతో కష్టపడి ఒళ్లు అలిస్తేనే తనకు తృప్తి ఉంటుందని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. తాజాగా ఓ పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడుతూ ఏ రంగంలోనైనా కష్టపడి పని చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా హీరోయిజం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ప్రతి మనిషి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. నేను కూడా ఎన్ని రోజులు ఇలా కష్టపడి డ్యాన్సులు, ఫైట్ లు చేయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. నడుచుకుంటూ వెళ్లి కూడా సూపర్ హిట్ లు సొంతం చేసుకుంటున్నారు.

హాయిగా సెట్ కు వెళ్లి మేకప్ వేసుకుని నటించి, వాళ్లు ఇచ్చిన డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకొని వచ్చేస్తే బాగుంటుంది. కానీ, అలాంటి పరిస్థితి మనది కాదు. మనం ఆడాలి, నిజంగానే ఫైట్లు చేయాలి. ఒల్లు హూనం చేసుకోవాలి. అలా చేయకపోతే దర్శక నిర్మాతలకు, సినిమా చూసే ప్రేక్షకులకు తృప్తి ఉండదు. అలాగే నాకు కూడా తృప్తిగా ఉండదు. అందుకే కష్టపడాలి అని అన్నారు.ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రెండు లైనప్ లో ఉన్నాయి. బింబిసారా ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీని ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

 

తాజాగా దీని గురించి దర్శకుడు మాట్లాడుతూ త్వరలోనే అందరిని సినిమాటిక్ అడ్వెంచర్ లోకి తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సోషియో ఫాంటసీ కథాంశంతో ఇది రానున్నట్లు తెలుస్తోంది. అనుష్క శెట్టి, మృనాల్ ఠాకూర్ హీరోయిన్స్ గా కనిపించే అవకాశం ఉందని టాక్. దీనితో పాటే గోల్డ్ బాగ్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పై ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version