తెలంగాణలో ‘స్కామ్‌గ్రెస్’కు చోటు లేదు : కేటీఆర్

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవ్వడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తూ  ఉండగా.. కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్ధుల ఎంపికలోనే ఉన్నాయి. మరోవైపు నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో జరుగుతోంది. విపక్షాలకు తన దైన శైలిలో కౌంటరిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కర్ణాటక నుంచి వందల కోట్లు వస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

ఓటుకు నోటు కేసులో నాడు లంచం ఇస్తూ దొరికిపోయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు దొంగల ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని చురకలు అంటించారు. తెలంగాణలో స్కామ్ గ్రెస్‌కు చోటు లేదన్నారు. అలాగే కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన డబ్బును తెలంగాణ ఎన్నికల్లో ప్రలోభాల కోసం తరలిస్తూ, కాంగ్రెస్ నేతలు దొరికిపోయారని బీఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.  నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version