“తార్ మార్ తక్కర్ మార్” అంటూ ఇరగదీసిన చిరూ – సల్మాన్

-

మెగాస్టార్ చిరంజీవి అప్‌క‌మింగ్ మూవీ.. “గాడ్ ఫాదర్”. మలయాళ బ్లాక్ బస్టర్ హిటైయిన లూసిఫర్ కు రీమేక్ ఈ చిత్రం. ఆల్రెడీ ఈ చిత్రం తెలుగులో డబ్ అయినప్పటికీ పలు మార్పులు చేసి.. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు మ‌ళ్లీ తెస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఇటీవల విడుదలైన టీజర్ తో మూవీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లారు మేకర్స్.

ఈ టీజర్ లో మెగాస్టార్ డిఫరెంట్ లుక్ లో కనిపించారు. ఈ మూవీలో స్టార్ హీరోయిన్ నయనతార ఓ కీలకపాత్రలో నటిస్తున్న సంగతిి తెలిసిందే. ఈ చిత్రంలో నయన్ ” సత్యప్రియ జై దేవ్” గా పరిచయం చేశారు. ఇక దీంతో పాటు మూవీ రిలీజ్ డేట్ పై కూడా సాలిడ్ క్లారిటీ ఇచ్చేశారు. సినిమా అనుకున్నట్లుగానే అక్టోబర్ 5 నే రిలీజ్ చేయనున్నట్లు ఈ పోస్టర్లో కనిపిస్తోంది. అలాగే గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో బిగ్ అప్డేట్ ను ప్రకటించారు. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గాడ్ ఫాదర్ ఫస్ట్ సింగిల్ ఇవాళ రిలీజ్‌ అయ్యింది. ఈ సాంగ్ ” బాస్ వచ్చిండు రే.. బేసులు పెంచిండురే” అంటూ ఈ పాట మొదలైంది. ” తార్ మార్ తక్కర్ మార్ అంటూ సాగే ఈ పాటకి చిరు – సల్మాన్ వేసే స్టెప్పులు అదిరిపోయాయి. ఈ పాటకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించగా.. కొరియోగ్రఫీ సాండి. ఈ సాంగ్ ని ప్రభుదేవా మాస్టర్ డైరెక్షన్ చేశారు. ఈ ఒక్క సాంగ్ తో చెప్పేయవచ్చు మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో అనేది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news