స్టార్ సినిమాలు కొబ్బరికాయ కొట్టిన రోజే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడం కష్టం. ఒకవేళ అలా చెప్పినా సరే అనుకున్న డేట్ కు రిలీజ్ అవడం కష్టం. షూటింగ్ పూర్తి అవడానికి దగ్గరపడుతున్న టైంలో ఆ అంచనాలను బట్టి ఓ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తారు. అయితే ఆ డేట్ కు మరో హీరో సినిమా వస్తే క్లాష్ అయినట్టే. ఇలాంటి సందర్భాలు ఎన్నో వచ్చాయి.
తాజాగా మహేష్ మహర్షి, చిరంజీవి సైరా సినిమాలకు ఈ డేట్ క్లాష్ అవబోతుంది. మహేష్ మహర్షి సినిమాను 2019 ఏప్రిల్ 5న రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. చూస్తుంటే సైరా కూడా అదే డేట్ కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. బాహుబలి తర్వాత అంతటి భారీ బడ్జెట్ తో మూడు భాషల్లో వస్తున్న సినిమా సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా కోసం మహేష్ మళ్లీ వెనక్కి తగ్గినా తగ్గుతాడని అంటున్నారు.
సైరా నిర్మాత రాం చరణ్, మహేష్ ఈమధ్య మంచి సన్నిహితంగా ఉంటున్నారు. సో సైరా కోసం ఏప్రిల్ 5 రిలీజ్ వదిలేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు. బాహుబలి బిగినింగ్ కోసం మహేష్ తన శ్రీమంతుడు సినిమాను వాయిదా వేసుకున్నాడు. సో మరోసారి సైరా కోసం అది రిపీట్ చేస్తాడేమో చూడాలి.