డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్..

హీరోయిన్ సంజనా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినప్పటి నుండి శాండల్ వుడ్ లో కలకలం రేగింది. పోలీసులు డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతం చేసారు. ఐతే తాజగా సినిమాటోగ్రాఫర్ డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకి పట్టుబడ్డాడు. కర్ణాటకలోని మంగళూరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఏబిసీడీ సినిమాలో నటించిన కొరియోగ్రాఫర్ కిషోర్ అమన్ శెట్టి డ్రగ్స్ సరఫరా చేస్తుండడంతో పోలీసులు అరెస్ట్ చేసారు. అమన్ తో పాటు మరో వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యాడు. వీరిద్దరూ కలిసి లక్షరూపాయల విలువ గల మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నారని పోలీసులు సమాచారం.

కిషోర్ అమన్ శెట్టి చేతుల్లోకి ముంబై నుండి సరఫరా అయ్యిందట. ఈ విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాలీవుడ్ లో రియా చక్రవర్తి, సాండల్ వుడ్ లో సంజనా, ఇలా రోజుకొకరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీలో బయటకి తెలియని చీకటి కోణాలు చాలా ఉన్నాయని అభిప్రాయ పడుతున్నారు. రంగుల ప్రపంచం వెనకాల చీకటి సామ్రాజ్యం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.