ఛోటా కే నాయుడు.. ఈ సారి త‌మ‌న్నాతో.. అలా..! ఏంటా ప్ర‌వ‌ర్త‌న‌..?

-

హీరోయిన్ల ప‌ట్ల ఛోటా కె నాయుడు అలా ప్ర‌వ‌ర్తించ‌డాన్ని సినీ ప్రేక్ష‌కులు తప్పు ప‌డుతున్నారు. అత‌ను ఇప్ప‌టికైనా ఇలా చేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లుకుతున్నారు.

టాలీవుడ్‌లోని ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ల‌లో ఒక‌డైన ఛోటా కె నాయుడు.. గ‌తంలో న‌టి కాజ‌ల్ అగ‌ర్వాల్ ప‌ట్ల అనుచితంగా ప్ర‌వ‌ర్తించి విమ‌ర్శ‌ల పాలైన సంగ‌తి తెలిసిందే. క‌వ‌చం సినిమా టీజ‌ర్ లాంచింగ్ సంద‌ర్భంగా హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌చ్చిందంటూ అత‌ను ఆమెను ముద్దుపెట్టుకున్నాడు. దీంతో కాజ‌ల్ ఆ ఘ‌ట‌న‌పై తీవ్ర అస‌హ‌నానికి లోనైంది. ఈ క్ర‌మంలో ఛోటా కె నాయుడును సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున విమ‌ర్శించారు. అయితే ఆ ఘ‌ట‌న జ‌రిగి ఇప్ప‌టికి చాలా రోజుల‌వుతున్నా.. ఛోటా కె నాయుడు మ‌రోసారి మ‌రో హీరోయిన్ ప‌ట్ల అలా ప్ర‌వ‌ర్తించి అందరిచే మ‌రో సారి విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్నాడు.

ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రాజు గారి గది సీక్వెల్ రాజు గారి గ‌ది 3 ఈ మ‌ధ్యే లాంచ్ అయిన విష‌యం విదిత‌మే. ఆ కార్య‌క్ర‌మానికి త‌మ‌న్నా హాజ‌రైంది. అందులో ఛోటా కె నాయుడు కూడా పాల్గొన్నాడు. అయితే కార్య‌క్ర‌మంలో ఒక స‌మ‌యంలో ఛోటా కె నాయుడు త‌మ‌న్నా చేతిని త‌న చేతిలోకి తీసుకుని నిమిరాడు. దీంతో త‌మ‌న్నా షాక్ అయింది. ఈ క్ర‌మంలో ఇప్పుడీ ఘ‌ట‌న‌పై మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో ఛోటా కె నాయుడును విమ‌ర్శిస్తున్నారు.

హీరోయిన్ల ప‌ట్ల ఛోటా కె నాయుడు అలా ప్ర‌వ‌ర్తించ‌డాన్ని సినీ ప్రేక్ష‌కులు తప్పు ప‌డుతున్నారు. అత‌ను ఇప్ప‌టికైనా ఇలా చేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. ఈ క్ర‌మంలో ఇప్పుడీ సంఘ‌ట‌న నెట్‌లో వైర‌ల్ అవుతోంది..!

Read more RELATED
Recommended to you

Latest news