సముద్రంలో విమానం కుప్పకూలిపోవడం తో.. చనిపోయిన ఒలివర్‏, ఇద్దరు కూతుళ్లు..!

-

వెకేషన్‏ లో భాగంగా ఒలివర్ ఫ్యామిలీ తో పాటు గ్రెనడైన్స్ ‏లోని బెక్వియా ద్వీపం నుంచి సెయింట్ లూసియాకు వెళ్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఇక దీని గురించి పూర్తి వివరాలు చూస్తే.. జనవరి 4న తూర్పు కరేబియన్ లోని బెక్వియా దగ్గర ప్రైవేట్ ద్వీపం పెటిట్ నెవిస్ ద్వీపం దగ్గర ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్ పోలీసులు ఇచ్చిన వివరాలను చూస్తే.. వెకేషన్‏లో భాగంగా ఒలివర్ ఫ్యామిలీ తో పాటు గ్రెనడైన్స్‏ లోని బెక్వియా ద్వీపం నుంచి సెయింట్ లూసియాకు వెళ్తున్నారట.

బెక్వియా లో టేక్ఆఫ్ అయిన కాసేపటికే కరేబియన్ సముద్రంలో కుప్ప కూలింది. ఈ ప్రమాదం లో ఒలివర్‏తో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలు మడిత (10), అన్నీక్ (12) కూడా అక్కడికక్కడే మృతి చెందారు. అలానే, పైలట్ కూడా చనిపోయారు. కోస్ట్ గార్డ్ సిబ్బంది మత్య్సకారులతో పాటు వీరి మృతదేహాలను వెతికి తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news