ఏ దేశం వెళ్ళినా..కొడాలి నానిని వదలబోం – బుద్దా వెంకన్న

-

ఏ దేశం వెళ్ళినా..కొడాలి నానిని వదలబోమని హెచ్చరించారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. వైఎస్ కుటుంబానికి కొడాలి నాని గౌరవిస్తాడు తప్ప.. ఎన్టీఆర్ కుటుంబానికి ఇవ్వడని మండిపడ్డారు. పందికొక్కుల ఇంట్లో ఉండి జగన్ జనం డబ్బులు తింటున్నాడు. నారా కుటుంబాన్ని విమర్శిస్తే మేం జగన్ను విమర్శిస్తామని హెచ్చరించారు. జగన్ను తిట్టించాలని ఉంటే వైసీపీ నేతలు మమ్మల్ని తిట్టాలన్నారు.

Buddha Venkanna warns Kodali Nani

తిరువూరులోో చంద్రబాబు సభకి విజయవాడ నుంచి ర్యాలీగా వెళ్తున్నామన్నారు. 2024 లో పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేయబోతున్నామని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఎవరనేది చంద్రబాబు చెబుతారని..అందరం కలిసికట్టుగా పార్టీ గెలుపుకు పనిచేస్తామని ప్రకటించారు. టీడీపీలో పదవులు ఇవ్వటంతో పాటు నేతలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. వైసీపీలో పదవులు ఇవ్వడమే కాదు.. ఆ నేతలకు గుర్తింపు తీసుకురా వాలని కోరారు. టీడీపీలో ఉన్న బీసీ నేతలకు వైసీపీలో ఉన్న బీసీ నేతలకు పోలిక లేదన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news