యాంకర్ రవిపై కేసు

-

బుల్లితెర యాంకర్స్ లో రవి కూడా ఒకడు. సంథింగ్ సంథింగ్ ప్రోగ్రాం నుండి పటాస్ వరకు అతని యాంకరింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు రవి. మధ్యలో ఆర్టిస్టుగా రెండు మూడు ప్రయత్నాలు చేసినా అవి బెడిసి కొట్టడంతో మళ్లీ సైలెంట్ అయ్యాడు. యాంకర్ గా సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్న రవిపై ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. సినిమా డిస్ట్రిబ్యూటర్ సందీప్ రవి మీద కేసు వేశాడు.

రవి, సందీప్ ల మధ్య ఆర్ధిక లావాదేవీలు ఉన్నాయట. డిస్ట్రిబ్యూటర్ అయిన సందీప్ రవి దగ్గర 28 లక్షలు ఇంట్రెస్ట్ కు తీసుకున్నాడట. అయితే సందీప్ డబ్బు విషయంలో ఇబ్బందులు పెట్టడంతో రవి అతన్ని మాట్లాడుదామని పిలిచి తన స్నేహితులతో దాడి చేశాడట. దీనిపై విచారించిన పోలీసులు రవిని స్టేషన్ కు పిలిపించి కేసు లేకుండా విషయాన్ని సర్ధుమనిగేలా చేశారట. వడ్డీ విషయంలో రవి వెనక్కి తగ్గబట్టే సందీప్ కేసు కూడా వెనక్కి తీసుకున్నాడట. మొత్తానికి అలా యాంకర్ రవి వార్తల్లోకి వచ్చాడు. డబ్బులు సంగతి పక్కన పెడితే మీడియాలో నలగడం ఎందుకని అనుకున్నాడో ఏమో సమస్యని పెద్దది చేసుకోకుండా తెలివిగా ప్రవర్తించాడు రవి.

Read more RELATED
Recommended to you

Exit mobile version