రొమాన్స్ రచ్చ చేశాడు.. కామెడీ కితకితలు పెడతాడా..!

-

ప్రేమతో మీ కార్తిక్ సినిమాతో పరిచయమైన కార్తికేయ ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ ల రొమాన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇక చివర్లో కార్తికేయ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆరెక్స్ 100లో రొమాన్స్ తో రచ్చ చేసిన కార్తికేయ తన తర్వాత సినిమాగా గొప్ప ఛాన్స్ అందుకున్నాడు.

తమిళ దర్శకుడు కృష్ణ డైరక్షన్ లో కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కళైపులి ఎస్ థాను ఈ సినిమా నిర్మిస్తున్నారు. నువ్వు నేను ప్రేమ సినిమా దర్శకుడిగా కృష్ణ తెలుగు వారికి పరిచయమే. అలాంటి క్రేజీ డైరక్టర్ సినిమాలో హీరోగా ఛాన్స్ అందుకున్నాడు కార్తికేయ. ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తుంది.

ఆరెక్స్ 100తో డిఫరెంట్ స్టోరీతో అలరించిన కార్తికేయ ఈసారి కామెడీతో కితకితలు పెట్టేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా గురించి మరిన్ని డీటైల్స్ త్వరలో వెళ్లడవుతాయి. ఇదే కాకుండా కార్తికేయకు మరో రెండు మూడు క్రేజీ ఛాన్సులు వచ్చినట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news