వెంకటేష్ 75.. అదిరిపోయే కాంబో..!

-

విక్టరీ వెంకటేష్ ఎఫ్-2 సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమా వెంకటేష్ 73వ సినిమా అవడం విశేషం. ఇక త్వరలో మేనళ్లుడు నాగ చైతన్యతో వెంకీమామ సినిమా చేస్తున్నాడు వెంకీ. బాబి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా కూడా వెంకీ మార్క్ ఎంటర్టైనర్ గా ఉంటుందని అంటున్నారు. ఇక ఇదిలాఉంటే వెంకటేష్ 75వ సినిమాకు భారీ ప్లానింగ్ ఉందట. ఈ సినిమా త్రివిక్రం డైరక్షన్ లో ఉంటుందని తెలుస్తుంది.

హారిక హాసిని వారు కొన్నాళ్లుగా వెంకటేష్ తో సినిమా చేయాలని చూస్తున్నా కుదరలేదు. ఫైనల్ గా వెంకీ 75వ సినిమా మాత్రం త్రివిక్రం, హారిక క్రియేషన్స్ సెట్ చేస్తున్నారట. ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగా పెట్టాలని చూస్తున్నారట. 73 సినిమాల కెరియర్ లో వెంకటేష్ అశేష జన హృదయాలను గెలుచుకున్నారు. ఆయన కూడా ఇక నుండి సినిమాల వేగం పెంచి త్వరలోనే 100వ సినిమాకు రావాలని ఆకాంక్షిస్తున్నారు ఆడియెన్స్.

Read more RELATED
Recommended to you

Latest news