శ్రీరామ
ఈరాశి వారు పసుపు పూలతో అమ్మవారిని అర్చించండి
మేషరాశి: మిశ్రమ ఫలితాలు. ప్రభుత్వ మూలక ధననష్టం, విందులు. వివాదాలకు దూరంగా ఉండండి. పరిహారాలు పసుపు పూలతో అమ్మవారిని అర్చించండి.
వృషభరాశి: అనుకూలమైన రోజు, బంధువుల రాక, ఇంట్లో వస్తువుల కోసం ఖర్చు. ఇష్టదేవతారాధన చేసుకోండి.
మిధునరాశి: ప్రతికూలమైన రోజు, పనుల్లో ఆటంకాలు, చిన్నచిన్న సమస్యలు. పరిహారం అమ్మవారికి చండీదీపారాధన చేయండి లేదా ఏకాగ్రతతో లలితా సహస్రనామం వినండి.
కర్కాటకరాశి: వస్తులాభం, కార్యాలల్లో నష్టాలు, పనుల్లో ఆటంకాలు. శివారాధనను తుమ్మిపూలతో లేదా తెల్ల జిల్లేడుతో పూజించండి.
సింహరాశి: ప్రతికూలమైన రోజు, ధననష్టం, కార్యనాశనం, విందులు, వినోదాలు. పరిహారాలు శివ/విష్ణు పూజ లేదా స్తోత్రాలు శ్రవణం చేయండి.
కన్యారాశి: మంచి ఫలితాలు ఉంటాయి. కార్యంలో విజయం, ఆరోగ్య విషయంలో చిన్న ఇబ్బందులు. పరిహారాలు తులసీ దేవికి నమస్కారం చేసుకోండి. రెండు తులసీ ఆకులను తినండి.
తులారాశి: మిశ్రమ ఫలితాలు, ప్రయాణ సూచనలు, బంధువులతో విభేదాలు, వ్యాపారంలో నష్ట సూచన. పరిహారాలు చండీదీపారాధన లేదా అమ్మవారికి ఆరావళి కుంకుమతో అర్చన చేయండి.
వృశ్చికరాశి: కార్యజయం, బంధువుల రాక, పనులు పూర్తి. ఇష్టదేవతారాధన చేయండి.
ధనస్సురాశి: ప్రతికూలమైన రోజు, ధననష్టం, కార్యాలల్లో నాశనం, విందులు, వినోదాలు. పరిహారాలు అమ్మవారికి పూజ చేసుకోండి.
మకరరాశి: కార్యలాభం, పనులు సులభంగా పూర్తవుతాయి. దేవాలయ దర్శన సూచన. అమ్మవారికి పూజ చేయండి లేదా స్తోత్రాలు చదువుకోండి.
కుంభరాశి: ప్రతికూలమైన రోజు, విచారం, కీర్తినష్టం. విష్ణుసహస్రనామాన్ని చదువుకోండి. వీలైతే దగ్గర్లోని దేవాలయంలో ప్రదక్షణలు చేయండి మంచి ఫలితాలు వస్తాయి.
-కేశవ