ఆచార్య నుంచి క్రేజీ పోస్ట‌ర్.. అదిరిన రామ్ చ‌ర‌ణ్‌లుక్‌..!

టాలీవుడ్ మెగాస్టర్ చిరంజీవి ఎన్నో అంచ‌నాల న‌డుమ బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న మూవీ ఆచార్య(acharya). ఈ సినిమాపై ఇప్ప‌టికే అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. దీని కోసం మెగా అభిమానులతో పాటు మిగ‌తా వారు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీలో చిరంజీవితోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలియ‌గానే ఫ్యాన్స్ అంచ‌నాలు ఆకాశాన్ని తాకాయి.

ఆచార్య/acharya

ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన చాలా పోస్టర్లు సినిమాపై హైప్ ను అమాంతం పెంచేశాయి. ఇందులో చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ఎలా ఉంటార‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే ఇద్ద‌రి లుక్స్ మాసివ్‌గా ఆక‌ట్టుకున్నాయి.

ఇక ఇప్పుడు తాజాగా ఆచార్య మూవీ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మూవీ మేక‌ర్స్‌. ఈ మూవీలో సిద్ద అనే రోల్‌లో రామ్ చరణ్ నటిస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న చిరంజీవి క‌లిసి నక్సలైట్స్ గా ఈ మూవీలో కనిపిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక కొత్త‌గా వ‌చ్చిన పోస్ట‌ర్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది.