PPF పథకం లో నెలకు రూ.1000 కడితే .. రూ.26 లక్షలు పొందొచ్చు..!

-

మీరు నెల నెలా డబ్బుల్ని పొందాలని అనుకుంటున్నారా..? అయితే మీకు మంచి ఆప్షన్ అందుబాటులో వుంది. దీనిలో ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. భారీ లాభం సొంతం చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..ప్రతీ నెలా అదిరిపోయే రాబడి పొందాలని అనుకునే వారికీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) PPF పథకం ఒకటి ఉంది. ఇందులో చేరితే నెలకు రూ.1000తోనే రూ.26 లక్షలకు పైన సంపాదించొచ్చు. ఈ పీపీఎఫ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు.

PPF పథకం
PPF పథకం

మీరు కావాలనుకుంటే మెచ్యూరిటీ కాలాన్ని ఐదేళ్ల చొప్పున ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కూడా. మీరు నెలకు రూ.1000 పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. 15 ఏళ్లు డబ్బులు పెడుతూనే వెళ్లాలి. తర్వాత మళ్లీ మెచ్యూరిటీ కాలాన్ని ఐదేళ్ల చొప్పున ఐదు సార్లు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్లాలి. అంటే మీకు 40 ఏళ్ల తర్వాత రూ.26 లక్షలకు పైన వస్తాయి.

మీరు 20 ఏళ్ల వయసులోనే పీపీఎఫ్‌లో చేరితే రిటైర్మెంట్ కల్లా నెలకు రూ.1000తోనే రూ.26 లక్షలకు పైగా పొందొచ్చు. ఇప్పుడు ఈ పీపీఎఫ్ స్కీమ్‌ పై 7.1 శాతం వడ్డీ రేటు వస్తోంది. అదే విధంగా ఈ పీపీఎఫ్ స్కీమ్‌లో డబ్బులు పెడితే ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా సొంతం చేసుకోవచ్చు. మీరు బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌లో పీపీఎఫ్ ఖాతాను తెరవొచ్చు. ఏడాదిలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇందులో పెట్టచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news