పవన్, క్రిష్ మూవీకి షాకింగ్ టైటిల్….??

-

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం అజ్ఞాతవాసి సినిమాతో సినిమాలకు బ్రేక్ నిచ్చిన పవన్ కళ్యాణ్, ఆ తరువాత రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఇక మళ్ళి రెండేళ్ల తరువాత ముఖానికి మేకప్ వేసుకున్న పవన్, దీని అనంతరం క్రిష్ జాగర్లమూడి సినిమాలో నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజ కార్యక్రమాలు జరగడంతో పాటు,

సినిమాకు సంబంధించి పలు కీలకమైన సెట్స్ రూపకల్పన కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. మరికొద్దిరోజుల్లో పవన్ కళ్యాణ్ ఈ సినిమా సెట్స్ లో జాయిన్ కానున్నారట. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ ఎమ్ రత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించనున్నారు. పవన్ కళ్యాణ్, రాబిన్ హుడ్ తరహా పాత్రలో ఒక గజదొంగ గా కనపడుతున్న ఈ సినిమాని మొఘలాయుల కాలం నాటి పీరియాడికల్ డ్రామాగా దర్శకుడు క్రిష్ తెరకెక్కించనున్నట్లు టాక్.

 

ఇకపోతే ఈ సినిమాకు ‘విరూపాక్షి’ అనే డిఫరెంట్ టైటిల్ ని పెట్టాలని చూస్తోందట సినిమా యూనిట్. సినిమా యొక్క కథ, థీమ్ ని బట్టి ఈ టైటిల్ అయితే సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారట. అయితే ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది….!!

Read more RELATED
Recommended to you

Exit mobile version